ఖమ్మం రూరల్ మండలం గుర్రాలపాడులో గురువారం వివిధ పార్టీలకు చెందిన 38 కుటుంబాలు మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరాయి. వారికి ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ జెండా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ చేస్తున్న పోరాటం, పార్టీ సిద్ధాంతాలు నచ్చి వీరంతా స్వచ్ఛందంగా చేరుతున్నారని ఆయన తెలిపారు.