ఖమ్మం రూరల్ ఎస్ఐకు 'గ్యాలంట్రీ' అవార్డు

5చూసినవారు
ఖమ్మం రూరల్ ఎస్ఐకు 'గ్యాలంట్రీ' అవార్డు
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో జరిగిన వేడుకల్లో, ఖమ్మం రూరల్ ఎస్సై ఎస్. కె. నాగుల్ మీరా ప్రతిష్టాత్మక 'రాష్ట్రపతి ఇండియన్ పోలీస్ గ్యాలంట్రీ' అవార్డును అందుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ పతకాన్ని స్వీకరించిన నాగుల్ మీరా, విధి నిర్వహణలో కనబరిచిన విశిష్ట సేవలకు గానూ ఈ అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.