ఖమ్మం రూరల్ మండలం పెద్దతండా గ్రామంలోని గిడ్డంగుల సంస్థ గోడౌన్లను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోడౌన్లలో నిల్వ చేస్తున్న బియ్యాన్ని పరిశీలించి, రికార్డులు, భద్రత అంశాలపై ఆరా తీశారు. స్టాక్, స్టాప్ రిజిస్టర్లను పరిశీలించి, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.