గురువారం ఖమ్మం రూరల్ మండలం కాచిరాజుగూడెం రైతు వేదిక వద్ద తెలంగాణ రైతు సంఘం, సీపీఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే అండగా నిలవాలని, మెంథా తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 50 వేల నష్టపరిహారం అందించాలని, ఖమ్మం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి పంట రుణాలు మాఫీ చేయాలని రైతు సంఘం, సీపీఎం మండల నాయకులు పొన్నం వెంకటరమణ డిమాండ్ చేశారు. ఏఈఓకి వినతిపత్రం అందజేశారు.