బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే బారుగూడెంను గ్రామపంచాయతీగా మారుస్తామని మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి శుక్రవారం ఖమ్మం రూరల్ మండలం బారుగూడెంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో స్థానికులకే ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. మంత్రి పొంగులేటి ప్రజలకు కనిపించడం లేదని విమర్శించారు.