కూసుమంచి: 18. 50 అడుగులకు చేరిన పాలేరు

614చూసినవారు
కూసుమంచి: 18. 50 అడుగులకు చేరిన పాలేరు
సాగర్ నుంచి నీటి విడుదల కారణంగా పాలేరు రిజర్వాయర్ లో నీటిమట్టం సోమవారం 18.50 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి సామర్థ్యం 23 అడుగులకు గాను ఇటీవల 12 అడుగులకు పడిపోవడంతో తాగునీటి సరఫరాకు ఇబ్బంది రాకుండా నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి నాలుగు రోజులుగా నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ నుంచి 2962 క్యూసెక్కుల నీరు చేరుతుండగా, ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. నీరు వృథా కాకుండా తాగునీటి అవసరాలకు వినియోగించాలని సీఈ మంగళంపూడి వెంకటేశ్వర్లు సిబ్బందికి సూచించారు.

సంబంధిత పోస్ట్