కూసుమంచి: సాంకేతికతను జోడిస్తే అధిక దిగుబడి

51చూసినవారు
కూసుమంచి: సాంకేతికతను జోడిస్తే అధిక దిగుబడి
రైతులు వ్యవసాయంలో సాంకేతికత పరిజ్ఞానాన్ని వినియోగిస్తే అధిక దిగుబడులు పొందొచ్చని వరి పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త సీహెచ్. పద్మావతి తెలిపారు. వికసిత్ కృషి సంకల్ప అభియాన్లో భాగంగా కూసుమంచి మండలంలోని భగవత్ వీడులో రైతులకు బుధవారం ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. ఖరీఫ్ పంటల సాగులో ఆధునిక పద్ధతులు, వరి నూతన వంగడాలు, వాటితో ఉపయోగాలను వివరించి, కేంద్రప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్