కూసుమంచి: కాలువ పూడికతీత పనులు వేగవంతం చేయాలి

81చూసినవారు
కూసుమంచి: కాలువ పూడికతీత పనులు వేగవంతం చేయాలి
కూసుమంచి మండలం నేలపట్ల పెద్ద చెరువు వద్ద జరుగుతున్న కాలువ పూడికతీత పనులను వేగవంతం చేయాలని తహశీల్ధార్ రవికుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం చెరువు వద్ద జరుగుతున్న పనులను తహశీల్ధార్ పరిశీలించారు. పనుల యొక్క వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే, నర్సరీని పరిశీలించి వన మహోత్సవానికి మొక్కలు సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు రామారావు, వీరభద్రం, రామనాథం తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్