కూసుమంచి మండలం తురకగూడెం గ్రామంలో కులం పేరుతో దూషించిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామానికి చెందిన కొమ్ము వీరస్వామి ఫిర్యాదు మేరకు బుర్ర ప్రసాద్ పై కేసు నమోదు చేసినట్లు కూసుమంచి ఎస్ఐ నాగరాజు తెలిపారు. ఇటీవల గ్రామంలో ఓ రైతు ఇంటి వద్ద బుర్ర ప్రసాద్ తనను కులం పేరుతో అవమానిస్తూ దూషించాడని బాధితుడు ఆరోపించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని ఎస్సై తెలిపారు.