కూసుమంచి మండలంలోని పలు గ్రామాల్లో జిల్లా వ్యవసాయాధికారి డి. పుల్లయ్య బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా లోక్యాతండా రైతులు పత్తి విత్తనాలు నాటుతుండగా ఏడీఏ సరిత, ఏఓ వాణి, ఏఈఓలతో కలిసి ఆయన కూడా నాటారు. అనంతరం డీఏఓ మాట్లాడుతూ భూమిలో తగిన పదును వచ్చాకే విత్తనాలు వేస్తే మంచి ఫలితం ఉంటుందని తెలిపారు. అనంతరం ఏరువాక పౌర్ణమి సందర్భంగా అధికారులు దుక్కి దున్ని రైతులకు అవగాహన కల్పించారు.