కూసుమంచి మండల కేంద్రంలోని చారిత్రక శ్రీ గణపేశ్వరాలయం (శివాలయం) అభివృద్ధి పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డితో కలిసి ఆదివారం శంకుస్థాపన చేశారు. రూ. 3 కోట్ల 30 లక్షల 50 వేల నిధులతో ఈ పనులు చేపట్టనున్నారు. ఆలయ పూర్వ వైభవాన్ని పెంపొందించేలా, భక్తులకు సకల వసతులు కల్పించేలా ఆధునికీకరణ పనులు పూర్తి చేస్తామని వారు ఈ సందర్భంగా తెలిపారు.