కూసుమంచి మండలంలోని జుజ్జులరావుపేటలో జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య బుధవారం మొక్కజొన్న, వరి పంటలను సందర్శించారు. మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు ఎమామెక్టిన్ బెంజోయేట్ 5 SG 80 గ్రాములు లేదా నోవాల్యూరాన్ 10 EC 300 గ్రాములు ఎకరానికి పిచికారి చేయాలని రైతులకు సూచించారు. అనంతరం, కూసుమంచిలో వాలంటీర్ల ద్వారా జరుగుతున్న డిజిటల్ క్రాప్ బుకింగ్ సర్వేను పరిశీలించి, దానిని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.