కూసుమంచి: యాప్ ద్వారా ఎరువులు బుక్ చేసుకోవాలి

2చూసినవారు
కూసుమంచి: యాప్ ద్వారా ఎరువులు బుక్ చేసుకోవాలి
ఖమ్మం జిల్లా వ్యవసాయాధికారి డి. పుల్లయ్య రైతులు వ్యవసాయ శాఖ రూపొందించిన యాప్ ద్వారా ఎరువులు బుక్ చేసుకోవాలని సూచించారు. కూసుమంచిలోని మన గ్రోమోర్ సెంటర్, జక్కేపల్లి సొసైటీలో యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకున్న రైతులతో ఆయన మాట్లాడారు. యాప్ విధానం సులభంగా ఉందని, యూరియా పంపిణీలో గత ఇబ్బందులు ఇప్పుడు లేవని రైతులు తెలిపారు. అనంతరం కూసుమంచిలో వరి పొలాలను పరిశీలించి, చీడపీడల నివారణకు సస్యరక్షణ చర్యలను వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్