ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులో జరిగిన ప్రజా దర్బార్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర్ పాల్గొన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో మే 4న ఖమ్మం నగరంలోని ఎస్ఆర్ గార్డెన్స్‌లో నిరుద్యోగ యువత కోసం మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాకు సంబంధించిన వాల్ పోస్టర్లను బుధవారం మంత్రి ఆవిష్కరించారు. ఈ మేళాలో సుమారు 80 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు.