కూసుమంచి విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 8: 30 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని స్థానిక ఏఈ తెలిపారు. సబ్ స్టేషన్ పరిధిలోని కూసుమంచి, లోక్యాతండా, జగ్మాల్ తండా, కోక్యతండ, లింగారంతండా, తురకగూడెం, గంగాబండ తండా, రావిచెట్టు తండా, బొటిమీద తండా గ్రామాలకు విద్యుత్ అంతరాయం ఉంటుందన్నారు. వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.