కూసుమంచి: తొలగని గ్యాస్‌ కష్టాలు... ఏజెన్సీ వద్ద పడిగాపులు

2చూసినవారు
గ్యాస్ సిలిండర్ల సరఫరాలో కంపెనీల వైఫల్యం కారణంగా వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూసుమంచి సమీపంలోని ఇండెన్ గ్యాస్ ఏజెన్సీ వద్ద ఉదయం నుంచే వినియోగదారులు సిలిండర్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఏజెన్సీ నిర్వాహకులు సమయానికి గేట్లు తెరవకపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేశారు. సకాలంలో గ్యాస్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వినియోగదారులు వాపోయారు.