కూసుమంచి: దెబ్బతిన్న వరి పొలాలను పరిశీలించిన ఏవో

0చూసినవారు
కూసుమంచి: దెబ్బతిన్న వరి పొలాలను పరిశీలించిన ఏవో
కూసుమంచి మండలంలోని ఈశ్వరమధారం, రాజుపేట, మల్లేపల్లి గ్రామాలలో వర్షాలకు దెబ్బతిన్న వరి పొలాలను మండల వ్యవసాయ అధికారి రామడుగు వాణి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పొలంలో నీటిని వెంటనే తీసివేయాలని సూచించారు. గింజ తయారై కోతకు సిద్ధంగా ఉన్న పొలాలు నీట మునిగినట్లయితే, లీటరు నీటికి 50 గ్రాముల చొప్పున ఉప్పును కలిపి ఆ ద్రావణాన్ని పిచికారి చేసినట్లయితే గింజలు మొలకెత్తకుండా ఉంటాయని రైతులకు వివరించారు.

ట్యాగ్స్ :