రేపు పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన

66చూసినవారు
రేపు పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం పాలేరు నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు క్యాంపు కార్యాలయ ఇన్ ఛార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి తెలిపారు. ఉదయం 9. 30 గంటలకు పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనాయకులతో వేరువేరుగా సమావేశమవుతారని తెలిపారు. సాయంత్రం 4. 30కు తిరుమలాయపాలెం మండలంలోని బచ్చోడు, రాజారం, సోలిపురం, కాకరవాయి గ్రామాల్లో పర్యటించి బీటీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు.