ఖమ్మం సీపీ సునీల్ దత్ మాట్లాడుతూ, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లే రహదారి ప్రమాదాలు సంభవిస్తున్నాయని తెలిపారు. నేలకొండపల్లిలో మంగళవారం జరిగిన 'ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక' రోడ్డు భద్రత అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రయాణాల్లో ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని, బాధ్యతగా వాహనాలు నడపాలని సూచించారు. కుటుంబ సభ్యులు క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు.