నేలకొండపల్లిలో ఇటీవల ఇంటర్ విద్యార్థి మరణించిన ప్రమాద స్థలాన్ని ఖమ్మం సీపీ సునీల్ దత్ మంగళవారం పరిశీలించారు. రహదారిపై ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేశారు. తక్షణమే ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయించారు. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ నష్టం జరగకుండా సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా రూరల్ ఏసిపి తిరుపతిరెడ్డి, ఎస్ఐ సంతోష్ కూడా ఉన్నారు.