నేలకొండపల్లి: కుమార్తె కళ్ల ముందు తండ్రి కన్నుమూత

0చూసినవారు
నేలకొండపల్లి: కుమార్తె కళ్ల ముందు తండ్రి కన్నుమూత
ఖమ్మం- కోదాడ హైవేపై గోకినేపల్లి సమీపాన మంగళవారం ఒక ద్విచక్రవాహనదారుడు గుండెపోటుతో మృతి చెందాడు. నేలకొండపల్లికి చెందిన మేకల అంజి(45) తన కుమార్తెతో కలిసి ఖమ్మంలోని ఆస్పత్రికి వెళ్తుండగా, గోకినేపల్లి వద్ద అంజికి గుండెపోటు రావడంతో ఇద్దరూ బైక్ పైనుంచి కింద పడ్డారు. అంబులెన్స్‌లో ముదిగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అంజి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనలో అతని కుమార్తె సరిత తలకు గాయాలయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్