నేలకొండపల్లి: టన్ను చెరుకుకు అరకిలో పంచదార ఉచితం

9చూసినవారు
నేలకొండపల్లి: టన్ను చెరుకుకు అరకిలో పంచదార ఉచితం
మధుకాన్ షుగర్ అండ్ పవర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎక్కడా లేని విధంగా టన్ను చెరుకుకు అర కిలో పంచదార రైతులకు ఉచితంగా అందజేయనున్నామని తెలిపారు. సోమవారం నేలకొండపల్లి మండలంలోని రాజేశ్వరపురం మధుకాన్ షుగర్ ఫ్యాక్టరీలో క్రషింగ్ ను ప్రారంభించిన ఆయన, ఫ్యాక్టరీ అభివృద్ది కోసం చెరుకు సాగును మరింత పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్టరీ ఎండీ కృష్ణయ్య, అసిస్టెంట్ కేన్ కమిషనర్ రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్