నేలకొండపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ ఫీడర్ పరిధిలో చెట్ల కొమ్మలు తొలగించనున్న నేపథ్యంలో, నేడు (శనివారం) విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఏఈ కె. రామారావు తెలిపారు. దీంతో నేలకొండపల్లి, కొత్తకొత్తూరు గ్రామాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కరెంట్ నిలిపివేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు.