నేలకొండపల్లి మండలం పైనంపల్లి పరిధిలో సోమవారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామస్థుల వివరాల ప్రకారం, పైనంపల్లిలోని పంట పొలాల్లో రెండు చోట్ల ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టి విలువైన వైర్లను దుండగులు అపహరించుకుపోయారు. విద్యుత్ శాఖ అధికారులు మంగళవారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్న సమయంలో ఇలా జరగడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు.