నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని నేలకొండపల్లి గ్రామంలో కేకుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. బెంగుళూరు అయ్యగారి బేకరీ మరియు చెన్నై అయ్యగారు బేకరీ వద్ద ప్రజలు భారీగా తరలివస్తున్నారు. కేకులు కొనుగోలు చేయడానికి గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ఒక కేజీ కేకు ధర ₹200 గా నిర్ణయించారు. ఈ సందర్భంగా ప్రజలు ఆనందోత్సాహాలతో కేకులను కొనుగోలు చేస్తున్నారు.