సీఐటీయూ నేలకొండపల్లి మండల కన్వీనర్‌గా పగిడికత్తుల నాగేశ్వరరావు మంగళవారం జరిగిన మండల మహాసభలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రావెళ్ళ సత్యం భవనంలో జరిగిన ఈ సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ, కార్మికుల హక్కుల కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు.