మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎమ్మెల్సీ తాత మధుసూదన్, పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పుష్పగుచ్చం అందజేసి కేసిఆర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. అలాగే, ఖమ్మం జిల్లా ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఇరువురులు చర్చించారు. ఖమ్మం జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కేసీఆర్ ఆదేశించారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ సమస్యలపై పోరాడాలన్నారు.