పాలేరు: పార్టీ మార్పుపై వస్తున్న వార్తలు అవాస్తవం

పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి, తాను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు. తన రాజకీయ ప్రయాణం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్లోనే కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. అసత్య ప్రచారాలను, ఊహాగానాలను అభిమానులు, కార్యకర్తలు నమ్మవద్దని ఆయన కోరారు. తామంతా కేసీఆర్ వెంటే ఉంటామని ఆయన స్పష్టం చేశారు.
