పాలేరు: సాగర్ ఆయకట్టుకు నీటి సరఫరా నిలిపివేత

79చూసినవారు
పాలేరు: సాగర్ ఆయకట్టుకు నీటి సరఫరా నిలిపివేత
పాలేరు రిజర్వాయర్ నుంచి జిల్లాలోని ఆయకట్టుకు సాగునీటి సరఫరాను అధికారులు శుక్రవారం నిలిపివేశారు. అంతేకాక పాలేరు కాల్వకు కూడా నీటి విడుదల నిలిచిపోయింది. జిల్లాలో యాసంగి సాగు పూర్తవడంతో సాగర్ ప్రాజెక్టు నుండి గురువారమే నీటి సరఫరా ఆగిపోగా, పాలేరు నుండి దిగువకు నీటి విడుదల నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు. అయితే, సాగర్ నుంచి నీటి సరఫరా ఆగినా ప్రస్తుతం రిజర్వాయర్ కు 400 క్యూసెక్కుల నీరు చేరుతోంది.

సంబంధిత పోస్ట్