పల్లెదావఖానలో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం

998చూసినవారు
పల్లెదావఖానలో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం
ఖమ్మం జిల్లా, పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలం, నాయకన్ గూడెం గ్రామంలోని పల్లెదావఖానలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కంచరిసైదమ్మ ప్రారంభించారు. అనంతరం ఏఎన్ఎం రాణితో కలిసి పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయడం ద్వారా వారి భవిష్యత్తును సురక్షితం చేయాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం, ఎమ్మెల్ హెచ్ పి ఆశ, ఆశా వర్కర్లు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్