ఏదులాపురం డంపింగ్ యార్డు తొలగింపు

2చూసినవారు
ఏదులాపురం డంపింగ్ యార్డు తొలగింపు
ఏదులాపురం శ్మశానవాటిక సమీపంలో ఉన్న డంపింగ్ యార్డును 32వ వార్డు కౌన్సిలర్ మామిళ్ల శ్రీనాథ్ రెడ్డి చొరవతో శనివారం మున్సిపాలిటీ అధికారులు తొలగించారు. ఈ డంపింగ్ యార్డు వల్ల శ్మశానవాటికకు వచ్చే ప్రజలు దుర్వాసన, ఇతర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే చెరువు నీరు కలుషితమై పర్యావరణానికి హాని కలుగుతోంది. కౌన్సిలర్ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లడంతో అధికారులు స్పందించి డంపింగ్ యార్డును తొలగించారు. దీంతో శ్మశానవాటిక పరిసరాలు పరిశుభ్రంగా మారాయి.

ట్యాగ్స్ :