
రెండు బోగీల మధ్య ప్రమాదకరంగా ప్రయాణం (వీడియో)
TG: ఓ యువకుడు రెండు రైలు బోగీల మధ్య కూర్చుని ప్రమాదకరంగా ప్రయాణం చేశాడు. ఈ ఘటన తెలంగాణ-మంచిర్యాల పరిధిలో జరిగింది. గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ రైలుపై రెండు బోగీల మధ్య కూర్చుని ప్రమాదకరంగా వెళ్తున్న వ్యక్తిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కాగా విచారణలో ఆ యువకుడు పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదకర ప్రయాణాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.




