ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ఉమ్మడి గ్రామ పంచాయతీలు ఈశ్వరామాదారం, రాజుపేట బజార్లలో బీఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం ఘనంగా జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచులు భూక్యా శిరీష రవి, కొలిశెట్టి శ్రీనివాస్, ఉపసర్పంచులు జవ్వాజి మౌనిక, సీతారాములు, ఇరుగు మైసలు, వార్డు సభ్యులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.