తిరుమలాయపాలెం: ఏనెకుంట తండాలో మిర్చి చోరీకి యత్నం

1చూసినవారు
తిరుమలాయపాలెం: ఏనెకుంట తండాలో మిర్చి చోరీకి యత్నం
తిరుమలాయపాలెం మండలంలోని ఏనెకుంట తండాకు చెందిన రైతులు బానోతు మల్సూర్, బానోతు రవి తమ మిర్చి పంటను సమీప అడవిలోని కల్లాల్లో ఆరబెట్టారు. రాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు సుమారు 15 క్వింటాళ్ల మిర్చిని దొంగిలించేందుకు ప్రయత్నించారు. మిర్చిని రాశులుగా పోసి తరలించే ప్రయత్నం చేసినా, తెల్లవారడంతో దొంగలు పారిపోయినట్లు తెలిసింది. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను ఇలా చోరీ చేసేందుకు ప్రయత్నించడం ఆందోళన కలిగిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్