తిరుమలాయపాలెం: గ్రామ దీపికల వినూత్న నిరసన!

6చూసినవారు
తిరుమలాయపాలెంలో వీఓఏలు (గ్రామ దీపికలు) తమ నిరసనను తీవ్రతరం చేశారు. తక్కువ వేతనాలతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తూ, వారు రోడ్డుపైనే వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం తమ మొండి వైఖరిని వీడి వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని వీఓఏలు డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.