తిరుమలాయపాలెం మండల కేంద్రంలో సోమవారం పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన ఒక ఆటోను ఆపి తనిఖీ చేయగా, అందులో ఒక కేజీ 200 గ్రాముల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ఎస్సై కూచిపూడి జగదీష్ కథనం ప్రకారం, నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.