తిరుమలాయపాలెం: పెండింగ్ ఫీజు రియంబర్స్‌మెంట్ విడుదల చేయాలి

67చూసినవారు
తిరుమలాయపాలెం: పెండింగ్ ఫీజు రియంబర్స్‌మెంట్ విడుదల చేయాలి
పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రియంబర్స్‌మెంట్ వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు వరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శనివారం తిరుమలాయపాలెం మండల కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. 7న కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్