తిరుమలాయపాలెం మండలంలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో, తిమ్మక్కపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ నాయకురాలు రేపాకుల సుభద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ప్రజాపంథా రాజకీయ పార్టీల నాయకులు, ప్రజల అభిప్రాయం మేరకు ఈ ఏకగ్రీవం జరిగింది. మండలంలో తొలి సర్పంచ్ అభ్యర్థిగా సుభద్ర నిలవడం విశేషం. దీనిపై అధికారులు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.