తిరుమలాయపాలెం: ఎండ ప్రభావంతో వీఓఏకు అస్వస్థత

6చూసినవారు
తిరుమలాయపాలెం: ఎండ ప్రభావంతో వీఓఏకు అస్వస్థత
తిరుమలాయపాలెంలో ఎనిమిది రోజులుగా వీఓఏలు రిలే నిరాహార దీక్షలు చేస్తుండగా, శుక్రవారం శిబిరంలో గుగ్గిళ్ల ఉమ ఎండ తీవ్రతతో సొమ్మసిల్లి పడిపోయింది. దీంతో ఆమెను సీహెచ్సీ తరలించి చికిత్స చేయించారు. ఈ సందర్భంగా వీఓఏల జేఏసీ జిల్లా అధ్యక్షురాలు వేల్పుల సుశీల మాట్లాడుతూ ఎండల ప్రభావంతో పలువురు అస్వస్థతకు గురవుతున్నా సమస్యల పరిష్కారంపై స్పందించక పోవడం గర్హనీయమని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం స్పందించాలని ఆమె డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్