కూసుమంచి మండలం మల్లాయిగూడెం గ్రామ పంచాయతీ హట్యాతండాకు చెందిన మాజీ ఎంపీటీసీ బాదావత్ వీరన్న తల్లి తులసమ్మ (65) పాము కాటుతో చనిపోయారు. గత రాత్రి పాము కరవగా ఖమ్మం ఆస్పత్రికి తీసుకెళ్లిట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున తులసమ్మ మృతి చెందినట్లు చెప్పారు. కాగా ఖమ్మం ఆస్పత్రి వద్ద కుటుంబ సభ్యులు మృతదేహం వద్ద రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది.