ఏదులాపురం మున్సిపాలిటీలో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్న కృష్ణ, పట్టణంలోని ఒక ప్రాంతంలో విద్యుత్ స్తంభంపై మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడిపోయారు. ఈ ఘటనలో ఆయన చేయి విరిగింది. తీవ్ర గాయాలైనప్పటికీ, స్వయంగా తేరుకొని ప్రథమ చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి వెళ్లారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.