మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం జిల్లాలో పర్యటించి, ఉదయం 9:30 గంటలకు ఖమ్మం 1వ డివిజన్ విద్యానగర్ లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఏదులాపురం మున్సిపల్ పరిధిలోని పలు ప్రాంతాలలో సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సత్యనారాయణపురంలోని టీసీవీ రెడ్డి ఫంక్షన్ హాల్ లో జరిగే మున్సిపల్ పరిధి కాంగ్రెస్ శ్రేణుల సమావేశంలో పాల్గొంటారు.