ఏదులాపురం: నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

4చూసినవారు
ఏదులాపురం: నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 33/11 కేవీ వరంగల్ క్రాస్ రోడ్డు సబ్ స్టేషన్, 11కేవీ వరంగల్ క్రాస్ రోడ్డు ఫీడర్లలో మరమ్మతుల కారణంగా గురువారం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని విద్యుత్ ఏఈ ప్రభాకర్ రావు తెలిపారు. ఈ అంతరాయం వల్ల లుంబినివనం, ఏదులాపురం, ఆటోనగర్, శ్రీరాంనగర్, ఆదిత్యనగర్ 1, 2, వరంగల్ క్రాస్ రోడ్, షాబాద్ నగర్, కార్తికేయ టౌన్ షిప్, గుర్రాలపాడులలో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్