ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలం కోరుట్లగూడెం క్వారీలో విద్యుత్ షాక్ తో మనోజ్ అనే యువకుడు మృతి చెందాడు. అనంతనగర్ కు చెందిన మనోజ్, తన అన్న పనిచేస్తున్న క్వారీని చూడటానికి వెళ్లి విద్యుత్ తీగను పక్కకు జరుపుతూ ప్రమాదానికి గురయ్యాడు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బాధితుని సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.