అశ్వాపురం: అస్వస్థకు గురై ఒకరు మృతి

2464చూసినవారు
అశ్వాపురం: అస్వస్థకు గురై ఒకరు మృతి
అశ్వాపురం మండలంలో ఆదివారం వడదెబ్బతో ఒక రైతు మృతి చెందాడు. జగ్గారం గ్రామానికి చెందిన మాదినేని బాబు అనే రైతు వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లి చెట్టు కింద అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా, అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. వడదెబ్బ కారణంగానే మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.