కరకగూడెం మండలంలో వ్యక్తిపై హత్యాయత్నం

2159చూసినవారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం అశ్వాపురంపాడు వలస ఆదివాసీ గ్రామంలో భీమరాజ్ అనే వ్యక్తిపై సొంత ఊరికి చెందిన నలుగురు వ్యక్తులు వేటకత్తులతో దారుణంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడిని పోలీసులు 108 లో మణుగూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని బాధితుడి భార్య కోరింది.

సంబంధిత పోస్ట్