మణుగూరు ఆర్టీసీ డిపో నుంచి హైదరాబాద్, తిరుపతికి నూతన బస్సు సర్వీసులను పునరుద్ధరించినట్లు డిపో మేనేజర్ కె. శ్యాంసుందర్ శనివారం తెలిపారు. మణుగూరు నుంచి హైదరాబాద్ బీహెచ్‌ఈఎల్‌కు ఏటూరునాగారం, హనుమకొండ మీదుగా ప్రతిరోజూ రాత్రి 7, 8, 9 గంటలకు బస్సులు బయలుదేరుతాయని చెప్పారు. హైదరాబాద్ నుంచి మణుగూరుకు రాత్రి 8, 8. 45, 9 గంటలకు సర్వీసులు ఉంటాయన్నారు. తిరుపతికి ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటలకు నేరుగా బస్సు నడుస్తుందని తెలిపారు.