భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం జింకలగూడెంలో చేతబడి చేస్తుందనే అనుమానంతో ఎస్. కే. సకినా బీ అనే వృద్ధురాలి పై సోమవారం గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. ఆమెను తాళ్లతో కొట్టి, చెట్టుకు మేకులు దింపి బలవంతంగా చెట్టుపైకి ఎక్కించారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
చేతబడు లకు శాస్త్రీయ ఆధారం లేదని, మూఢనమ్మకాల పేరుతో దాడులు చేయడం చట్టరీత్యా తీవ్రమైన నేరమని హైకోర్టు, పోలీసులు హెచ్చరిస్తున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా, సమస్యలుంటే పోలీసులను ఆశ్రయించాలని పోలీసులు స్పష్టం చేశారు.