LOKAL APP కథనానికి స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు

2783చూసినవారు
LOKAL APP కథనానికి స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు
కరకగూడెం మండలం భట్టుపల్లి గ్రామంలో విద్యుత్ తీగలకు అడ్డంగా తాటి మట్టలు, చెట్ల కొమ్మలు వేలాడుతూ ప్రమాదకరంగా మారాయి అంటూ lLOKAL APP లో వార్త ప్రచురితమైంది. ఈ వార్తపై విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే స్పందించారు. వెంటనే క్షేత్రస్థాయికి చేరుకుని విద్యుత్ వైర్లకు అడ్డుగా ఉన్న తాటి మట్టలు, కొమ్మలను తొలగించారు. దీనితో సంభవించే షార్ట్ సర్క్యూట్ ప్రమాదం తప్పడంతో గ్రామస్తులు ఉపశమనం పొందారు. సమస్యను వెలుగులోకి తెచ్చిన LOKAL APP యాజమాన్యానికి, తక్షణమే చర్యలు చేపట్టిన విద్యుత్ శాఖ అధికారులకు భట్టుపల్లి గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్