గురువారం గుండాల మండలంలో అవినీతి కేసులో మరో అధికారి పట్టుబడ్డాడు. నడిగూడెం సెక్షన్ పరిధిలోని ఫారెస్ట్ బీట్ అధికారి బాణోత్ నరేష్, సాయనపల్లికి చెందిన పోడు రైతును ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు రూ. 10,000 లంచం డిమాండ్ చేశాడు. పోడు రైతు నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అతన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.